Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలోని పెన్నా వంతెన ప్రారంభం అయిన పాత చెక్ పోస్టు నుండి మైపాడు గేటు వరకూ జాఫర్ సాహెబ్ కెనాల్ ను ఆనుకుని ఆక్రమించిన నిర్మించుకుని ఉన్న నివాసాలను తొలగించారు అధికారులు. ఈ తొలగింపుకు సంభందించి ఇది వరకే ఆయా నివాసాల్లో ఉంటున్న వారికి అధికారులు నోటీసులు జారీ చేసి ఉన్నారు. ఈ నేపద్యంలో మంగళవారం ఉదయం జేసిబితో ఆ ప్రాంతానికి చేరుకున్న అధికారులు జాఫర్ సాహెబ్ కెనాల్ గట్టున ఉన్న మొత్తం 300 నివాసాలను తొలగించే పనిని ప్రారంభించారు. అయితే ఇళ్ల తొలగింపును స్థానికులు అడ్డుకోగా పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపు చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, టిడిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి తదితరులు ఇళ్ల తొలగింపు ప్రాంతాలనికి వెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు. నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇటుక కూడా కదల్చమని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అనీల్ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాలువ ఆధునీకరణ పనులు చేపట్టేందుకు ఆక్రమణలు తొలగిస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలియజేశారు.

One Comment
Irrigation authorities are made responsible for such occupations. And no MLA has power to issue pattas either by word or by any means. these places are for the people, trees and Parks only and not for religious , common usage like Parkings . or commercial. Nellore is in Very Bad state due to earlier politicians of all parties. The Collector and SP are unable to take actions. its Pity. pl change. Change is invited now.