Clock Of Nellore ( Nellore ) – హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వారి నివాసంపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నెల్లూరులోని వారి నివాసంపై శనివారం ఉదయం మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం హానర్ ఆఫ్ గార్డ్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
