హామీ నెరవేర్చుకున్న ఎమ్మెల్యే అనీల్ : బ్రాహ్మణ కర్మక్రియల భవనానికి శంఖుస్థాపన

Clock Of Nellore ( Nellore ) – గత ఎన్నికలకు ముందు బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్. పేద, మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాల్లో ఎవరైనా కాలం చేస్తే వారి పార్ధివ దేహాన్ని పెట్టుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఎన్నికలకు ముందు అనేక మంది ఎమ్మెల్యే అనీల్ దృష్ఠికి తీసుకురాగా తానే స్వంత నిధులతో భవనం నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు నెల్లూరు మినీ బైపాస్ లోని పిటి రంగరాజన్ పెట్రోల్ బంకు పక్కన బ్రాహ్మణ కర్మక్రతువుల భవనానికి గురువారం శంఖుస్థాపన చేశారు. 40 లక్షల స్వంత నిధులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ భవనంలో నిరుపేద బ్రాహ్మణ కటుంబంలో ఎవరైనా చనిపోతే పార్టీవ దేహాన్ని ఇక్కడ ఉంచడంతో పాటూ అంత్యక్రియల అనంతరం కర్మక్రియలు కూడా ఇక్కడే నిర్వహించుకోవచ్చునని ఎమ్మెల్యే అనీల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయడైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, కార్పొరేటర్లు కర్తం ప్రతాప్ రెడ్డి, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, వైసీపి నేతలు గణేశం వెంకటేశ్వర్లు రెడ్డి, నేతాజీ సుబ్బారెడ్డి, బ్రాహ్మణ సంఘం నేతలు పాల్గొన్నారు.

Read Previous

రొట్టెల పండుగలో జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ

Read Next

విభజన హామీలు నెరవేరాలి : కోర్కెల రొట్టె అందుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.