ఎంపి మాధవ్ ను బర్త్ రఫ్ చేయండి – దిష్ఠిబొమ్మను దహనం చేసిన తెలుగు యువత

Clock Of Nellore ( Nellore ) – నగ్నంగా వికృత చేష్ఠలకు పాల్పడి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో నవ్వుల పాలు చేసిన ఎంపి గోరంట్ల మాధవ్ ను బర్త్ రఫ్ చేయాలని నెల్లూరుజిల్లా తెలుగు యువత అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయుడు డిమాండ్ చేశారు. నగ్న వికృత చేష్ఠలను నిరసిస్తూ నెల్లూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్, తెలుగు మహిళ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా నేతలు తిరుమల నాయుడు, షేక్ అమ్రుల్లా, పనబాక భూలక్ష్మి తదితరులు ఎంపి మాధవ్ దిష్ఠిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని స్వర్గీయ ఎన్టీఆర్, పివి నరసింహారావు, బాలయోగి, ముప్పవరపు వెంకయ్యనాయుడు వంటి మహనీయులు జాతీయ స్థాయిలో ఇనుమడింప జేశారని అన్నారు. వైసీపి ఎంపి గోరంట్ల మాధవ్ మాత్రం నగ్నంగా వికృత చేష్ఠలకు పాల్పడి ఆంధ్ర జాతి ఖ్యాతిని నవ్వుల పాలు చేశారని మండిపడ్డారు. తక్షణం ఎంపి మాధవ్ ను బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

Read Previous

ప్రతీ ఒక్కరూ చూడాల్సిన ప్రదర్శన – ప్రారంభించిన మంత్రి కాకాణి

Read Next

ఉదయగిరి నారాయణ మృతిపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ – భార్యకు ఉద్యోగం

Leave a Reply

Your email address will not be published.