Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన డి. హరిత, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం నెల్లూరులోని మంత్రి కార్యాలయానికి వెళ్లిన కమిషనర్ హరిత మంత్రికు పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కాకాణి కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు నగర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
