పారిశుధ్యాన్ని తనిఖీ చేసిన కమిషనర్ జాహ్నవి – సిబ్బందికి షోకాజ్ నోటీసులు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ పనులు జరిగేలా అధికారులు, సిబ్బంది దృష్టి సారించాలని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి ఆదేశించారు. 18 వ డివిజను హరనాథపురం పరిసర ప్రాంతాల్లోని డ్రైనేజి కాలువల్లో పూడికతీత పనులను కమిషనర్ శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షా కాలపు పరిస్థితుల దృష్ట్యా లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరకుండా డ్రైనేజీ కాలువల ద్వారా సాఫీగా ప్రవాహం కొనసాగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని డివిజనుల్లో డ్రైను కాలువల పూడికతీత పనులు జరుగుతున్నాయని, ప్రజలు అవగాహన పెంచుకుని కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు వంటి, ఏలాంటి వ్యర్ధాలు పారవేయొద్దని కమిషనర్ సూచించారు. స్థానిక పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్, సచివాలయ సానిటరీ సెక్రటరీకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. డివిజనులో పారిశుద్ధ్య నిర్వహణ లోపించి, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి, పారిశుద్ధ్య విభాగం అధికారులు, సచివాలయం కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read Previous

టిడిపి రైతు పోరు అట్టర్ ప్లాప్… మీటర్లు పెట్టినా రైతులకు కరెంటు ఉచితమేనన్న కాకాణి

Read Next

నెల్లూరు రూరల్ లో విస్త్రృతంగా గడప గడపకు తిరుగుతున్న కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.