Clock Of Nellore ( Kavali ) – నెల్లూరు జిల్లా కావలిలో శ్రీ చైతన్య స్కూలుకు చెందిన బస్సు బోల్తా పడింది. సోమవారం ఉదయం కావలి నుండి బయలుదేరిన బస్సు సమీప ప్రాంతాలకు చెందిన విద్యార్ధులను ఎక్కించుకుంది. సరిగ్గా సిరిపురం వద్దకు వచ్చే సరికి బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. బస్సులో సుమారు 15 మంది విద్యార్ధులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం నుండి విద్యార్ధులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు విద్యార్ధులకు మాత్రం స్వల్పంగా గాయాలు అయినట్లు తెలిస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణంగా బస్సు బోల్తా పడినట్లు చెబుతున్నారు. బస్సలు ఫిట్ నెస్ సర్టిఫికేట్ ఉందా, డ్రైవర్ కు లైసెన్స్ ఉందా అనేది తెలియాల్సి ఉంది. ప్రమాదంపై విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు గురైనారు. శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
