వైసీపిలో చేరిన సౌత్ రాజుపాళెం వాసులు… ఆహ్వానించిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు 12వ డివిజన్ లోని సౌత్ రాజుపాళెంకు చెందిన 25 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. స్థానిక నేతలు నాటకరాణి రఘరామయ్య, అన్నపరెడ్డి రాధయ్య, అన్నపురెడ్డి హనుమంతు, అన్నపురెడ్డి రవి, నాటకరాణి భాస్కర్ ఆధ్వర్యంలో వారంతా వైసీపి తీర్ధం పుచ్చుకున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో వారంతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ పార్టీ కండువాలు కప్పి గిరిధర్ రెడ్డి వైసీపిలోకి ఆహ్వానించారు. అనంతరం గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీలకు అతీతంగా చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై వారంతా వైసీపిలో చేరడం శుభపరిణామమన్నారు. పార్టీలో కొత్తగా చేరిన వారు, గతంలో ఉన్న వారంతా సమన్వయంతో కలిసి రూరల్ లో వైసీపిని మరింత బలోపేతం చేయాలని కోరారు.

Read Previous

ఆత్మకూరులో టిడ్కో నివాసాలు… లబ్ధిదారులకు అందజేసిన మంత్రి ఆదిమూలపు

Read Next

పోడు భూమిని మింగేస్తున్నారు : జడ్పీ ఛైర్ పర్సన్ కు ఫిర్యాదు చేసిన స్థానికులు

Leave a Reply

Your email address will not be published.