Clock Of Nellore ( Nellore ) – ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలందరికీ పారదర్శకంగా అందించేందుకు రూపొందించిన సచివాలయాల వ్యవస్థలో మెరుగైన సేవలు అందించాలని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి ( IAS Jahnavi ) సచివాలయ కార్యదర్శులకు సూచించారు. నగరంలోని 11, 14 వ డివిజన్లోని బాలాజీ నగర్, ఏ.సీ నగర్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను శనివారం తనిఖీ చేసిన అనంతరం సచివాలయాలను కమిషనర్ సందర్శించారు. సచివాలయంలో వివిధ పథకాలకు సంభందించిన రికార్డులు, కార్యదర్శులు, వాలంటీర్ల హాజరు రిజిస్టర్లను కమిషనర్ పరిశీలించారు. జగనన్న కాలనీలు, టిడ్కో గృహాల పంపిణీ చేయడంలో వార్డు ఎమినిటీ కార్యదర్శులు మరింతగా కృషి చేయాలని సూచించారు.
