డాక్టర్ బిందుమీనన్ కు మరో అవార్డు : అపోలో వైద్యుల అభినందనలు

  • డాక్టర్ బిందు మీనన్ కు మరో అవార్డు
  • ఫెలోషిప్ ప్రధానం చేసిన అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ
  • అభినందనలు తెలిపిన అపోలో హాస్పిటల్ బృందం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి, డాక్టర్ బిందు మీనన్ కు మరో అరుదైన గౌరవం దక్కింది ( Nellore Apollo Hospital ). డాక్టర్ బిందు మీనన్ చేస్తున్న సేవలను గుర్తించిన అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ఫెలోషిప్ ను ప్రధానం చేసింది. ఈ సందర్భంగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో హాస్పిటల్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ శ్రీ రామ్ సతీష్, న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ బిందు మీనన్ ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా న్యూరాలజీ ఆన్ వీల్స్ ను ప్రవేశపెట్టి ఎంతో మందికి సేవలు అందిస్తున్న డాక్టర్ బిందు మీనన్ ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్నారని, ఇప్పుడు అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ఫెలోషిప్ ప్రధానం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో బిందు మీనన్ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం న్యూరాలజీ విభాగాధిపతి, అవార్డు గ్రహీత డాక్టర్ బిందు మీనన్ మాట్లాడుతూ తనకు వస్తున్న ఈ అవార్డులు, తనపై మరింత బాధ్యతను బాధ్యతను పెంచాయని అన్నారు. అనంతరం పలువురు వైద్యులు డాక్టర్ బిందు మీనన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు

Read Previous

ఉమ్మడి నెల్లూరుజిల్లాలో 15 కోట్లతో అభివృద్ధి పనులు : జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం

Read Next

సచివాలయాలను తనిఖీ చేసిన కమిషనర్ జాహ్నవి…

Leave a Reply

Your email address will not be published.