20వ డివిజన్ లో మంచినీటి పైప్ లైన్ – ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు 20వ డివిజన్ లోని గ్రీన్ ఫీల్డ్ హోమ్స్, షిరిడీ సాయి నగర్ లో 46 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మంచినీటి పైప్ లైన్ ను వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. పైప్ లైన్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య తీరిందని స్థానికులు ఈ సందర్భంగా కోటంరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ గడచిన మూడేళ్లలో 20వ డివిజన్ లో 3కోట్లా 36 లక్షలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. 20వ డివిజన్ అన్నీ విధాలుగా అభివృద్ధి చెందుతుందని, నివాసాలు పెరుగుతున్నాయని, ఈ డివిజన్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్, ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఛైర్మైన్ రావు శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు చేజర్ల కవిత తదితరులు పాల్గొన్నారు.

Read Previous

భక్తి శ్రద్ధలతో బక్రీద్… ప్రార్ధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Next

మరో ఘనతను కైవసం చేసుకున్న చెన్నై అపోలో హాస్పిటల్….

Leave a Reply

Your email address will not be published.