వైసీపి ప్లీనరీ : నెల్లూరు రూరల్, వెంకటగిరి నుండి భారీగా తరలిన కార్యకర్తలు

Clock Of Nellore ( Nellore & Venkatagiri ) – గుంటూరు జిల్లాలో ఇవాళ, రేపు జరగనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి భారీగా కార్యకర్తలు తరలివెళ్లారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. మేయర్ స్రవంతి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో కార్పొరేటర్లు, ఇతర నేతలు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. అలాగే వెంకటగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు గుంటూరు ప్లీనరీకి బయలుదేరి వెళ్లారు. వైసీపి నేత చెన్ను బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు బస్సుల్లో బయలు దేరి వెళ్లారు.

Read Previous

నెల్లూరులో ఘనంగా వైఎస్ జయంతి – నివాళి అర్పించిన నేతలు

Read Next

నెల్లూరులో రైతు దినోత్సవం… ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

Leave a Reply

Your email address will not be published.