Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లన్నింటికి మరమ్మత్తు పనులు చేపడుతున్నామని అతి త్వరలోనే ఆ పనులు పూర్తవుతాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన నెల్లూరు 38వ డివిజన్ లోని టెక్కేమిట్ట ప్రాంతంలో వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ దాసరి అమృతతో కలిసి పర్యటించారు. మాగుంట లే అవుట్ అండర్ బ్రిడ్జి వద్ద టెక్కేమిట్టకు వెళ్లే రోడ్డు ఎత్తు పల్లాలుగా ఉండగా దాన్ని పరిశీలించి ఈ రోడ్డును సరిచేసే ప్రక్రియను సోమవారం ప్రారంభిస్తామని అన్నారు. 20 రోజుల్లోగా పనులు పూర్తి చేస్తామన్నారు. అలాగే పావని హోమ్స్ వద్ద మురికి నీటి సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి అప్పటికప్పుడు పూడికలు తీయించి సమస్యను పరిష్కరించారు. టెక్కేమిట్ట ప్రాంతంలో 90 లక్షలతో డ్రైన్ల నిర్మాణ పనులు 15 రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి రాజేష్, సంధానీ, రియాజ్, అశోక్, ఖలీల్, శారద తదితరులు పాల్గొన్నారు.
