Clock Of Nellore ( Nellore ) – బస్సులో ప్రయాణీకులకు మాయమాటలు చెప్పి వారి బ్యాగులోని బంగారు నగలతో ఉడాయించిన ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి జైలుకు పంపారు నెల్లూరు జిల్లా పోలీసులు. ఈనెల 13వ తేదీనా పసుపులేటి శ్రీదేవి అనే మహిళ తన భర్తతో కలిసి నెల్లూరు నుండి సీతారామపురంకు ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. ఈ క్రమంలో ఉదయగిరి బస్టాండ్ వద్ద సీటు వెనుక కూర్చొని ఉన్న ఇద్దరు మహిళలు ఆమెకు మాయమాటలు చెప్పి బ్యాగులో ఉన్న 200 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించి అక్కడి నుండి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీతారామపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఇద్దరు మహిళలను ఇవాళ అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. దీనిపై ఇవాళ నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా క్రైం విభాగం అదనపు ఎస్పీ చౌడేశ్వరి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. చోరీకి పాల్పడ్డ వారి వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఈపూరు పాళెంకు చెందిన సాతుపాటి నాగమ్మ, సాతుపాటి సునీత అనే ఇద్దరు ఈ నేరానికి పాల్పడ్డారని అన్నారు. ఇద్దర్నీ అరెస్టు చేశామన్నారు.
