Clock Of Nellore ( Nellore ) – చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, క్రీడలు, విద్యలో రాణించాలంటే చక్కటి ఆరోగ్యం కలిగి ఉండటం చాలా ముఖ్యమని వై.సీ.పీ. రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ స్రవంతి పేర్కొన్నారు. స్థానిక ఏ.సీ.సుబ్బారెడ్డి స్టేడియం నందు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వై.సీ.పీ. రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ స్రవంతి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ నిర్వాహకులను, సమ్మర్ క్యాంప్ లో పాల్గొంటున్న పిల్లలను అభినందించారు. పిల్లలకు శారీరక, మానసిక వికాసం చాలా ముఖ్యమని, క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ గుడ్డు, అరటి పండు లాంటి పండ్లను, వీలున్న ఇతర పౌష్టిక ఆహారాలను తప్పక తీసుకోవాలన్నారు. వాకర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ను పిల్లలు, యువత అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తదుపరి నిర్వాహకులతో కలిసి పిల్లలకు, క్రీడాకారులకు గుడ్డు, బిస్కెట్లు, అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి తిరుపతి నాయుడు, కనకట్ల రఘురాం ముదిరాజ్, కార్యదర్శి వింజం రామానాయుడు, కోశాధికారి దాసరి అనంత రామారావు, చీఫ్ కోచ్ యతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
