Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. ఇప్పటికే కొన్ని పనులు శరవేగంగా సాగుతుండగా మరి కొన్ని పనులు మొదలయ్యే దశలో ఉన్నాయి. తాజాగా నెల్లూరు 38వ డివిజన్ లోని టెక్కేమిట్టలో 90 లక్షల రూపాయలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. స్థానిక కార్పొరేటర్ దాసరి అమృతతో కలిసి శంఖు స్థాపన చేశారు. అనంతరం గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ పూర్తి స్థాయి నాణ్యతా ప్రమాణాలతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. సమస్యలు లేని నియోజకవర్గంగా నెల్లూరు రూరల్ ను తీర్చిదిద్ధడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటూ మాజీ మేయర్ భానుశ్రీ, రాష్ట్ర అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ షేక్ సైదాని, నెల్లూరు కార్పొరేషన్ కో – ఆప్షన్ సభ్యురాలు హురియా, నేతలు దాసరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
