Clock Of Nellore ( Kodur ) – విహారం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కళ్ల ముందు ఇద్దరు పిల్లలు సముద్రంలో కొట్టుకుపోయి మృతువాత పడటాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాదం వారి కుటుంబంలో తీరన్ని శోకాన్ని నింపింది. నెల్లూరుజిల్లాలో ఈ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లో కెళ్లే… నెల్లూరు నగరంలోని పోస్టల్ కాలనీకి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ రెడ్డి – పావని దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. శశాంక్ రెడ్డి ( 15 ), ప్రణీత్ రెడ్డి ( 16 ) ఈ ఇద్దరు చదువుకుంటున్నారు. శెలవులు కావడంతో అందరూ ఇవాళ ఉదయం మధ్యాహ్నం తోటపల్లి గూడూరు మండలంలోని కొత్త కోడూరు బీచ్ కు వెళ్లారు. అందరూ సముద్ర స్నానం చేస్తుండగా సరిగ్గా మధ్యాహ్నం 1.30 గంటలకు సముద్రంలో అలలకు ఇద్దరు పిల్లలు లోతుకు కొట్టుకుపోయారు. తల్లిదండ్రులు కేకలు వేయడంతో కొందరు వచ్చి వారిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఇద్దరు పిల్లలను బయటకు తీసుకురాగా అప్పటికే శశాంక్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి ఇద్దరూ మృత్యువాత పడి ఉన్నారు. విషయం తెలుసుకున్న తోటపల్లి గూడూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం కోసం నెల్లూరు జిజిహెచ్ కు తరలించారు.
