దిశ యాప్ ఉంటే ఆయుధం మీ చేతిలో ఉన్నట్లే : అదనపు ఎస్పీ హిమవతి

Clock Of Nellore ( Nellore ) – ప్రతీ మహిళ ఫోన్ లో దిశ యాప్ ఉండాలని, ఆ యాప్ మహిళలకు ఆయుధంగా పనిచేస్తుందని నెల్లూరు జిల్లా అదనపు ఎస్పీ హిమవతి పేర్కొన్నారు. నెల్లూరు సంతపేట పోలీస్ స్టేషన్ సిఐ అన్వర్ బాష ఆధ్వర్యంలో సోమిశెట్టి కళ్యాణ మండపంలో జరిగిన దిశ యాప్ రిజిస్ట్రేషన్ మెగా డ్రైవ్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ఫోన్ లో దిశ యాప్ ఉంటే మహిళలు ధైర్యంగా ఉండొచ్చని అన్నారు. ఎవరు ఇబ్బంది పెట్టినా, ఏ సమస్య ఎదురైనా దిశ యాప్ ను ఆయుధంలా ఉపయోగించుకోవచ్చునన్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు వారి వారి పరిధిలోని మహిళలకు ఈ యాప్ పై అవగాహన కల్పించి వారి ఫోన్లలో డౌన్ లోడ్ చేయించాలన్నారు. సంతపేట సిఐ అన్వర్ బాష మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు తమ స్టేషన్ పరిధిలో దిశ యాప్ రిజిస్ట్రేషన్స్ ముమ్మరంగా చేపడుతున్నామని చెప్పారు. ప్రత్యేకంగా సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులచే ఈ యాప్ డౌన్ లోడ్ చేయిస్తున్నామని ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తున్నట్లు సిఐ అన్వర్ బాష తెలియజేశారు. దిశ ద్వారా మహిళలపై నేరాలు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రామకృష్ణ, వేలూరు మహేష్, జయలక్ష్మి, సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

 

Read Previous

అలా కోరారు… ఇలా వెళ్లారు… ఎమ్మెల్యే కోటంరెడ్డి చొరవతో తీరనున్న కష్టాలు

Read Next

సజ్జల, విజయసాయికి కృతజ్ఞతలు తెలిపిన బీద మస్తాన్ రావు

Leave a Reply

Your email address will not be published.