జీవితంలో సగం రోజులు జైల్లో ఉండండి – విదేశీ వనిత కేసులో నెల్లూరు కోర్టు తీర్పు

Clock Of Nellore ( Nellore ) – ఈ ఏడాది మార్చి 8వ తేదీనా నెల్లూరుజిల్లా సైదాపురం సమీపంలో విదేశీ వనితపై లైంగిక దాడికి యత్నించిన కేసులో న్యాయ స్థానం 57 రోజుల్లోనే తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఇద్దరు నిందితులకు జీవిత కాలంలో సగం రోజులు కఠిన కారాగార శిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్లే.. లిథువేనియా దేశానికి చెందిన కరోలినా శ్రీలంక దేశానికి వచ్చి అక్కడి నుండి విమానంలో చెన్నై ఎయిర్ పోర్టుకు చేరింది. అక్కడి నుండి గోవా వెళ్లేందుకు చెన్నైలోని బస్టాండ్ కు చేరుకుని బెంగుళూరు బస్సు ఎక్కగా ఆమె వద్ద ఉన్న కరెన్సీ చెల్లుబాటు కాకపోవడంతో కండక్టర్ ఆమెను బస్సు దించేశాడు. అక్కడే ఆటో డ్రైవర్ గా ఉన్న నిందితుడు ఇంగిలాల సాయికుమార్ ఆమె మాయమాటలు చెప్పి అతని స్వస్థలమైన నెల్లూరుజిల్లాలోని మనుబోలు మండలం వెంకన్న పాళెంకు తీసుకొచ్చాడు. ఈ నేపద్యంలో గూడూరు పట్టణానికి చెందిన తన స్నేహితుడు ఆబిద్ తో కలిసి యువతిని సైదాపురం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వారి నుండి యువతి తప్పించుకుని రోడ్డుపైకి రాగా స్థానికుల సాయంతో సైదాపురం పోలీస్ స్టేషన్ కు చేరి విషయాన్ని వివరించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదే రోజు అరెస్ట్ చేశారు. 10 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసును నెల్లూరులోని 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు విచారించింది. ఇద్దరు నిందితులపై నేరం రుజువైంది. దీంతో న్యాయమూర్తి సి. సుమ… ఇద్దరు నిందితులకు జీవిత కాలంలో సగం రోజుల కఠిన కారాగార శిక్షను విధిస్తూ తీర్పు చెప్పారు. కేవలం 57 రోజుల్లో విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించడం గమనార్హం.

                                                                                                  నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ( ఫైల్ ఫోటో )

Read Previous

ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తా – వైసీపి కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ వివరణ

Read Next

మరో అమానవీయ ఘటన : బాలుడి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన తండ్రి

Leave a Reply

Your email address will not be published.