Clock Of Nellore ( Nellore ) – గుంటూరు రేంజ్ ఐజి త్రివిక్రమ్ వర్మ బుధవారం సాయంత్రం నెల్లూరుజిల్లాకు విచ్చేశారు. జిల్లా ఎస్పీ విజయరావుతో కలిసి కోవూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ, ఇతర జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ అస్థవ్యస్థంగా ఉందని దానిపై దృష్ఠి సారించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు. ప్రముఖుల పర్యటనలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మద్యం, గుట్కా, గంజాయి అక్రమ రవాణా విషయంలో సెబ్ ఉక్కు పాదం మోపాలని తెలిపారు. నైట్ బీట్ లు పక్కాగా నిర్వహించాలని, పరిధి లేకుండా ఫిర్యాదులపై జీరో FIR నమోదు చేయాలన్నారు. ప్రతీ మహిళ ఫోన్ లో దిశ యాప్ ఉండే విధంగా అవగాహన కల్పించాలని ఎస్పీకి సూచించారు. మహిళలు, పిల్లలు, వృద్దులపై జరిగే నేరాలను పూర్తిగా అరికట్టాలని ఐజి త్రివిక్రమ్ వర్మ జిల్లా అధికారులకు సూచించారు. గురువారం ముఖ్యమంత్రి జగన్ తిరుపతిలో పర్యటిస్తున్న నేపద్యంలో ఐజి తిరుపతికి వెళ్తూ మధ్యలో నెల్లూరులో ఈ తనిఖీలు చేపట్టారు.
