నెల్లూరులో పారిశుధ్యాన్ని పరిశీలించిన కమిషనర్ జాహ్నవి

Clock Of Nellore ( Nellore ) – క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నగర పాలక సంస్థకు ప్రజలంతా తడి, పొడి చెత్తలను విడివిడిగా చెత్త సేకరణ వాహనాలకు అందించి పారిశుద్ధ్య నిర్వహణ లో భాగస్వాములు కావాలని నెల్లూరు నగర ప్రజలను కమిషనర్ జాహ్నవి ( IAS Jahnavi ) కోరారు. శనివారం 23 వ డివిజన్ జ్యోతి నగర్, వేదాయపాలెం, 16వ డివిజన్ బాలాజీ నగర్, ఆదిత్య నగర్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను కమిషనర్ పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాల్లోని వివిధ స్థానిక సమస్యలను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించి, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను వెంటనే చేపట్టాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ( Nellore Muncipal Corporation ) డివిజనులో పారిశుధ్య నిర్వహణను పరిశీలించిన అనంతరం డ్రైను కాలువల్లో పూడికతీత పనులను కమిషనర్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరించాలని పారిశుద్ధ్య సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ ఆరోగ్య శాఖాధికారి హేమావతి, 16 వ డివిజన్ కార్పెరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి, నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం సిబ్బంది, స్థానిక సచివాలయం శానిటేషన్ కార్యదర్శులు, శానిటరీ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరులో ఈద్గా, షాదీ మంజిల్ ప్రారంభం… హాజరైన సినీ నటుడు అలీ

Read Next

సున్నా వడ్డీ పథకం… 3326 మందికి ఎమ్మెల్యే అనీల్ చెక్కుల పంపిణీ

Leave a Reply

Your email address will not be published.