నెల్లూరుజిల్లాలో హీరో ప్రభాస్ సినిమా షూటింగ్…

Clock Of Nellore ( Chejarla ) – వైజయంతి మూవీస్ బ్యానర్ లో హీరో ప్రభాస్ ( Prabhas ) నటిస్తున్న కొత్త చిత్ర షూటింగ్ శుక్రవారం నెల్లూరుజిల్లాలో ( Nellore District ) జరిగింది. చేజర్ల మండలం, పెరుమాళ్లపాడు గ్రామంలోని పెన్నానది తీరంలో ఆ చిత్రానికి సంభందించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు… చిత్ర బృందం. ఏడాది క్రితం పెన్నానదిలో ఇసుకలో బయట పడిన పురాతన శివాలయం ప్రధానంగా ఈ చిత్రీకరణ సాగింది. సుమారు 60 మంది చిత్ర బృందం చిత్రీకరణలో పాల్గొంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసే వ్యక్తి జిల్లాలోని కావలి చెందిన వ్యక్తి కావడంతో కొన్ని సన్నివేశాలను నెల్లూరుజిల్లాలో చిత్రీకరించాలని సిఫార్సు చేశారు. ఈ నేపద్యంలో కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. అయితే ఈ చిత్రీకరణలో ప్రభాస్ లేడు. గతంలో కూడా ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమా కూడా నెల్లూరులో చిత్రీకరణ అయిన విషయం తెలిసిందే.

 

Read Previous

నెల్లూరుజిల్లాలో వైసీపి నేత ఇంటిపై పెట్రోల్ పోసిన మహిళ…

Read Next

ఏపిని శ్రీలంకతో పోలుస్తారా… ఆనం ఆగ్రహం…

Leave a Reply

Your email address will not be published.