నెల్లూరులో రేపు ఉగాది వేడుకలు… శ్రీ రామ కథాసారం నాటక ప్రదర్శన

Clock Of Nellore ( Nellore ) – ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో దర్గామిట్టలోని కస్తూర్భా కళాక్షేత్రంలో శనివారం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని, ఉగాది ఉత్సవాలను వీక్షించేందుకు నగర ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు కలెక్టర్ చక్రధర్ బాబు కోరారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు రానున్న కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కళారత్న, గురుశ్రీ పసుమర్తి రామలింగ శాస్త్రి బృందం ఆధ్వర్యంలో ” శ్రీ రామ కథా సారం” అను నృత్య రూపకాన్ని ప్రదర్శించనున్నారని ఆయన వివరించారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయే ఈ నృత్య రూపకాన్ని నగర వాసులు తిలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

Read Previous

కరెంటు ఛార్జీలపై నెల్లూరుజిల్లాలో బిజేపి నిరసనలు…

Read Next

అందరికీ ఉగాది శుభాకాంక్షలు – కమిషనర్ దినేష్ కుమార్

Leave a Reply

Your email address will not be published.