నెల్లూరులో పోలీసు అధికారుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్…

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో శనివారం జిల్లా పోలీస్ అధికారులు రెండు టీములుగా ఏర్పడి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. గూడూరు రూరల్ సిఐ కెప్టెన్ గా ఓ టీము, నెల్లూరులోని చిన్నబజార్ పోలీస్ స్టేషన్ సిఐ మధుబాబు కెప్టెన్ గా మరో టీము మ్యాచ్ లో పోటాపోటీగా తలపడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సిఐ మధుబాబు టీము 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన గూడూరు రూరల్ సిఐ టీము 16 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసి విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం జిల్లా ఎస్పీ విజయరావు విన్నర్ టీముకు, రన్నర్ టీముకు బహుమతులు అందజేశారు. 24 గంటలూ విధి నిర్వహిణలో ఉండే పోలీసు అధికారులకు మానసిక ఉల్లాసం ఎంతో అవసరమని అన్నారు. మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. విన్నర్స్ కు, రన్నర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Read Previous

మత్స్యకారులను ఇబ్బంది పెట్టేందుకే 217 జీవో తీసుకొచ్చారు : సోమిరెడ్డి

Read Next

చోరీ కేసులు… ముగ్గుర్ని అరెస్ట్ చేసిన నాయుడుపేట పోలీసులు

Leave a Reply

Your email address will not be published.