మత్స్యకారులను ఇబ్బంది పెట్టేందుకే 217 జీవో తీసుకొచ్చారు : సోమిరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – మత్స్యకారుల విషయంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో నెల్లూరులో జరిగిన మత్స్యకార హోరు కార్యక్రమంలో సోమిరెడ్డి పాల్గొన్నారు. 217 జీవోను రద్దు చేయాలంటూ ఏర్పాటు చేసిన మత్స్యకారుల సభలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర పార్టీల నేతలు కూడా హాజరయ్యారు. సోమిరెడ్డి వారికి దీక్షకు సంఘీభావం తెలిపారు. మత్స్యకారులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే 217 జీవోని ప్రభుత్వం తీసుకొచ్చిందని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారుల పొట్ట కొట్టేలా ఉన్న 217 జీవోని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read Previous

బాలాయపల్లి అభివృద్ధికి కృషి – సర్వసభ్య సమావేశంలో ఆనం వెల్లడి

Read Next

నెల్లూరులో పోలీసు అధికారుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్…

Leave a Reply

Your email address will not be published.