Clock Of Nellore ( Nellore ) – అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ ఛైర్ – పర్సన్ ఆనం అరుణమ్మ ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు. జడ్పీ సిఈఓ శ్రీనివాసరావు, సిబ్బందితో కలిసి ఆమె పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆనం అరుణమ్మ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. అలాంటి మహనీయుని పేరు మన జిల్లాకు ఉండటం గర్వకారణమని, ఆయన చూపిన మార్గంలో ప్రతీ ఒక్కరూ పయనించాలని విజ్ఞప్తి చేశారు.