Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. తెలుగు మహిళ నెల్లూరు నగర అధ్యక్షురాలు రేవతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు నెల్లూరు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే లింగ సమానత్వం రావాలని అన్నారు. అన్నీ రంగాల్లో మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత పురుషులపై ఉందని, అప్పుడే వారు అనుకున్న లక్ష్యాలను సాధించగలరని చెప్పారు. తెలుగు దేశం పార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని అన్నారు. ఈ వేడుకల్లో మహిళా నాయకులు తాళ్లపాక అనురాధ, పనబాక భూ లక్ష్మి, కొమరి విజయ, సుశీలమ్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


