Clock Of Nellore ( Nellore ) – కట్నం కోసం తన భర్త తనను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని నెల్లూరులోని దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఓ మహిళ. అరవిందనగర్ లో నివాసం ఉండే షేక్ షబీనాకు కృష్ణపట్నం పోర్టులో మెకానికల్ ఇంజనీర్ గా పనిచేసే షేక్ ఇబ్రహీంకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. పెళ్లైన సంవత్సరం తర్వాత నుండి తనను అదనపు కట్నం కోసం వేధిస్తూ తీవ్రంగా కొడుతున్నట్లు బాధితురాలు చెబుతోంది. పిల్లల కోసం అవన్నీ భరాయిస్తూ వస్తున్నానని, చిత్రహింసలు తీవ్రం కావడంతో 6 నెలల క్రితం దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా తన భర్తను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారన్నారు. కౌన్సిలింగ్ తర్వాత కూడా తన భర్త తీరులో మార్పు లేదని అంతే కాకుండా దారుణంగా ప్రవర్తించసాగాడని కన్నీరు మున్నీరైంది. చిత్రహింసలు భరాయించలేక తాను తన తల్లివద్దకు వెళ్లి పోయానన్నారు. తనకు న్యాయం చేయాలని మైనార్టీ నేతలతో కలిసి దిశ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.