ప్రాణం తీసిన ఈత సరదా… నెల్లూరుజిల్లాలో యువకుడు మృతి

Clock Of Nellore ( Vakadu ) – ఈత సరదా ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. నెల్లూరుజిల్లా వాకాడు మండల కేంద్రంలో ఆదివారం సరదాగా పెద్ద కాలువలో ఈత కొడతామని వెళ్లిన వంశీ అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీకి అనుసంధానంగా ఉన్న తూపిలి చెరువు సప్లై ఛానల్ ప్రధాన గేటు వద్ద వంశీ అనే యువకుడు ఈతకు వెళ్లాడు. దురదృష్ఠవశాత్తు మృత్యువాడ పడ్డాడు. స్థానికులు విషయాన్ని గుర్తించి కాలువలోకి దూకి వంశీని బయటకు తీసి ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వంశీ మృతి చెందాడు.

Read Previous

బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్… మహిళ మృత్యువాత

Read Next

డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డితో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి భేటీ…

Leave a Reply

Your email address will not be published.