ఘనంగా నేదురుమల్లి జయంతి వేడుకలు… పలు చోట్ల సేవా కార్యక్రమాలు

Clock Of Nellore ( Buero Report ) – మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి 87వ జయంతి వేడుకలు నెల్లూరుజిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రమైన నెల్లూరుతో సహా కోట, వాకాడు, వెంకటగిరి ప్రాంతాల్లో జరిగిన ఈ వేడుకల్లో నేదురుమల్లి కుమారుడు, రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మైన్ నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి పాల్గొని తండ్రి చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే పలు చోట్ల రక్తదాన శిభిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాం కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ఎంతో కృషి చేశారని, నెల్లూరుజిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు. అంతే కాకుండా జిల్లా నుండి ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకు తాను కృషి చేస్తానని స్పష్టం చేశారు.

Read Previous

60వ రోజు… నిరాడంబరంగా జగనన్న మాట – కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట

Read Next

యానాదుల జోలికొస్తే సహించేది లేదు : హెచ్చరించిన కేసి పెంచలయ్య

Leave a Reply

Your email address will not be published.