60వ రోజు… నిరాడంబరంగా జగనన్న మాట – కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట

Clock Of Nellore ( Nellore ) – కార్యకర్తల యోగక్షేమాలే లక్ష్యంగా వారి నివాసాలకు వెళ్లి వారికి భరోసాగా నిలిచేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన జగనన్న మాట – కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట కార్యక్రమం నిరాడంబరంగా సాగుతుంది. ఈ కార్యక్రమంలో ఆదివారంతో 60వ రోజుకు చేరుకుంది. 60వ రోజు 31వ డివిజన్ లో పర్యటించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యకర్తల నివాసాలకు ఒంటరికా వెళ్లి వారితో ఏకాంతంగా మాట్లాడారు. శ్రీలంక కాలనీ, రామకోటయ్య నగర్ ప్రాంతాల్లోని కార్యకర్తల నివాసాలకు వెళ్లారు. కార్యకర్త కుటుంబసభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా… ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీసి తాను అండగా ఉంటానని ఆయా కుటుంబాలకు భరోసా ఇచ్చారు.

Read Previous

వైసీపిలోకి చేరికలు… కోటంరెడ్డి సమక్షంలో 150 కుటుంబాల చేరిక

Read Next

ఘనంగా నేదురుమల్లి జయంతి వేడుకలు… పలు చోట్ల సేవా కార్యక్రమాలు

Leave a Reply

Your email address will not be published.