Clock Of Nellore ( Nellore ) – ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన నెల్లూరుసిటీ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి ఉత్తర క్రియలు గురువారం నెల్లూరులోని వారి నివాసంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ నేతలు అబ్ధుల్ అజీజ్, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, బీద రవిచంద్ర, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి, తాళ్లపాక అనురాధ, వైసీపి నేత బీద మస్తాన్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి తదితరులు ఉత్తర క్రియల్లో పాల్గొని ముంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి చిత్రపతానికి నివాళి అర్పించారు. ఆయన సేవలను పార్టీలకు అతీతంగా నేతలు గుర్తు చేసుకున్నారు.

