Clock Of Nellore ( Nellore ) – అనారోగ్యంతో మృతి చెందిన నెల్లూరు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్. గురువారం రాత్రి నెల్లూరు ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉన్న శ్రీధర్ కృష్ణారెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు. ముంగమూరు చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రితో పాటూ నుడా ఛైర్మైన్ ముక్కాల ద్వారకానాథ్, స్థానిక కార్పొరేటర్ కామాక్షిదేవి, వైసీపి నేత సన్నపురెడ్డి పెంచల రెడ్డి ఉన్నారు.
