టిడిపి బలోపేతంపై మంత్రి నారాయణ, ఎంపి వేమిరెడ్డి దంపతుల సమాలోచనలు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, ఆయన సతీమణి పొంగూరు రమాదేవి దృష్ఠి సారించారు. ఇందులో భాగంగా నెల్లూరులోని వారి నివాసంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు మంత్రి నారాయణను మర్యాద పూర్వకంగా కలిశారు. నివాసానికి వచ్చిన వేమిరెడ్డి దంపతులకు మంత్రి నారాయణ దంపతులు సాదరంగా స్వాగతం పలికారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు తీసుకోవాల్సిన వివిధ అంశాలపై వారు చర్చించారు. అనంతరం కోవూరు నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మంత్రి దృష్ఠికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Read Previous

ప్రజలే అతిధులు… 27 కోట్లు… 240 పనులు… నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి రికార్డులు…

Read Next

వైభవంగా మహా శివరాత్రి వేడుకలు : ముక్కంటిని దర్శించుకున్న మంత్రి నారాయణ

Leave a Reply

Your email address will not be published.