ప్రజలే అతిధులు… 27 కోట్లు… 240 పనులు… నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి రికార్డులు…

Clock Of Nellore ( Nellore Rural ) – అన్న, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాటలో దూసుకెళ్తున్నారు… టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి…. గత ఏడాది మే 15వ తేదీనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 60 రోజుల్లో పూర్తి చేసిన 339 అభివృద్ధి పనులను ప్రజలచే ఒకే రోజు ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అన్నను స్పూర్తిగా తీసుకున్న తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇవాళ అదే ప్రజలచే నియోజకవర్గంలో ఒకే సారి 240 అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయించారు. మొత్తం 27 కోట్ల రూపాయలతో ఈ పనులు 60 రోజుల్లో పూర్తి కానున్నాయి. ఎడమకాలి నొప్పితో బాధపడుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చికిత్స కోసం కేరళలో ఉండగా… ఈ కార్యాన్ని తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తన భుజాలపై వేసుకున్ని విజయవంతంగా పూర్తి చేశారు. 240 చోట్ల స్థానిక టిడిపి నేతలు.. ప్రజలతో అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయించారు. 33వ డివిజన్ తాతయ్య బడి వద్ద జరిగిన శంఖుస్థాపన కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఇంఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారధ్యంలో 340 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. నెల్లూరు రూరల్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్పష్టం చేశారు.

Read Previous

ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం నారా లోకేష్ : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

Read Next

టిడిపి బలోపేతంపై మంత్రి నారాయణ, ఎంపి వేమిరెడ్డి దంపతుల సమాలోచనలు

Leave a Reply

Your email address will not be published.