ఈనెల 26 కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం : 585 కోట్లతో సిద్ధమైన పద్దు

Clock Of Nellore ( Nellore ) – రానున్న ఆర్ధిక సంవత్సరానికి భారీ అంచనాలతో నెల్లూరు నగరపాలక సంస్థ పద్దును సిద్ధం చేసింది. ప్రజలకు ఆర్ధిక ఉపశమనాన్ని కనబరచని యంత్రాంగం, అన్ని వనరులు ఆదాయంవైపే మళ్లించింది. రూ.5,85,48,20,000 కోట్లతో 2025-26 బడ్జెట్ ను అధికారులు సిద్ధం చేశారు. నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాన్ని ఈనెల 26న మేయర్ పొట్లూరి స్రవంతి అధ్యక్షతన నిర్వహించనున్నారు. రెవెన్యూ ఆదాయం రూ.2,73,92,20,000, మూలదనపు ఆదాయం రూ.3,11,56,00,000 మొత్తం ఆదాయం రూ.5,85,48.20,000గా చూపించగా ప్రణాళికేతర వ్యయం 5.2,47,43,00,000, ప్రణాళిక వ్యయం 4.48,52,46,000గా.. 6.95.95,46,0005తో పద్దును యంత్రాంగం సిద్ధం చేసింది. రూ.121,30,89,764 నిల్వ బడ్జెట్తో 2025-26 ఆర్ధిక సంవత్సరాన్ని మొదలు పెట్టబోతున్నట్లు లెక్క కట్టిన అధికారులు. మొత్తం రూ.706,79,09,764తో వార్షిక బడ్జెట్ ను రూపొందించారు. అంత్య నిల్వ రూ.10,83,63,764 బడ్జెట్లో పొందుపరిచారు. పన్ను, అసైన్డ్ రెవెన్యూ, మున్సిపల్ ఆస్తులు, ఫీజులు, యూజర్ ఛార్జీలు, భవనాల క్రమబద్ధీకరణ, అమ్మకం, అద్దెలు, రెవెన్యూ గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లు, సబ్సిడీలు మొత్తం రూ.2,73,92,20,000గా చూపించగా. ఎస్టాబ్లిష్మెంట్, పరిపాలనపరమైన, కార్యకలాపాలు, నిర్వహణ, రికవరీలు చెల్లింపులు, ప్రోగ్రాములు, ఇతర ఖర్చులు, ప్రియర్ పిరియడ్ వస్తువుల ఖర్చులు రూ.2,47,43,00,000తో సిద్ధం చేశారు.

Read Previous

అపోలో హాస్పిటల్ లో ప్రపంచ స్థాయి చికిత్సలు : ప్రపంచ తలగాయాల అవగాహనా దినోత్సవంలో వైద్యులు

Read Next

రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు : హెచ్చరించిన కమిషనర్ సూర్యతేజ

Leave a Reply

Your email address will not be published.