పొట్టేపాళెం కలుజుపై వంతెన నిర్మించండి : అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి విజ్ఞాపన

Clock Of Nellore ( Amaravati ) – నెల్లూరు నగరానికి ఆనుకుని ఉండే పొట్టేపాళెం కలుజుపై వంతెన నిర్మించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కోటంరెడ్డి మాట్లాడారు. నెల్లూరు నుండి పవిత్ర పుణ్య క్షేత్రాలైన నరసింహకొండ, జొన్నవాడతో సహా ఆత్మకూరు, ఉదయగిరి, కడప జిల్లాలోనే బద్వేలు తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే తప్పని సరిగా పొట్టేపాళెం కలుజు దాటాల్సి ఉందన్నారు. ఆ కలుజులో నిత్యం వరద నీరు ప్రవహిస్తూ ప్రమాదకరంగా ఉంటుందన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి పొట్టేపాళెం కలుజుపై వంతెన నిర్మించాలని, అలాగే నెల్లూరు రూరల్ తో పాటూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే ములుమూడి కలుజుపై కూడా వంతెన కావాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించి వంతెనల నిర్మాణాలకు నిధులు కేటాయించాలన్నారు. ఈ రెండు వంతెనలకు కేవలం 7 కోట్లు కేటాయిస్తే సరిపోతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు.

Read Previous

విద్యా రంగాన్ని బలోపేతం చేయండి : అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Read Next

మెడికవర్ లో రోగుల పునరావాస కేంద్రం : ప్రారంభించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్

Leave a Reply

Your email address will not be published.