జ‌గ‌న్ పాల‌న‌లో లా అండ్ ఆర్డ‌ర్ అట్ట‌ర్ ప్లాప్‌ : ధ్వజమెత్తిన నాారాయణ కుమార్తెలు సింధూర, శరణి

Clock Of Nellore ( Nellore ) – ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ అట్ట‌ర్ ప్లాప్ అని…ప్ర‌జ‌లకు మంచి చేయాల‌న్న ఆలోచ‌న‌ను వైసీపీ నాయ‌కులు మ‌ర‌చిపోయార‌ని… మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ కుమార్తెలు డాక్ట‌ర్ సింధూర పొంగూరు, పొంగూరు శరణి ఆరోపించారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా….వారు బుధవారం నెల్లూరు సిటీ 7వ డివిజ‌న్‌లోని నాగేంద్ర నగర్, శెట్టిగుంట రోడ్డు, 11వ డివిజన్ లోని సరస్వతి నగర్ తదితర ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ముందుగా ఆయా ప్రాంతాల్లో నారాయణ కుమార్తెలకు ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా వారు డివిజ‌న్లోని ప్ర‌తీ ఇంటికెళ్లి… టీడీపీ మేనిఫెస్టో ను వివ‌రించారు. మే 13న జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లంద‌రూ అమూల్య‌మైన ఓటును సైకిల్ గుర్తుపై ఓటేసి… నాన్న‌ని ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్ర‌భాక‌రెడ్డిని ఎంపీగా ఆశీర్వ‌దించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ప్రచారం అనంత‌రం డాక్ట‌ర్ సింధూర పొంగూరు, పొంగూరు శరణి మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి 2019 వ‌ర‌కు తెలుగుదేశం ప్ర‌భుత్వంలో మాజీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌లు ఎంతో శ్ర‌మించి మ‌న రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు, ప్రాజెక్టుల‌ను తీసుకువ‌చ్చార‌న్నారు. ఆ త‌రువాత వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం వాట‌న్నింటిని ఆపేసి…టీడీపీ శ్ర‌మ‌ను అంతా వృధా చేసింద‌ని మండిప‌డ్డారు. తెలుగు వారు మ‌న ఆంధ్ర రాష్ట్రంలో త‌ప్ప‌…ప్ర‌పంచంలో అన్నీ రాష్ట్రాల్లో ఎంతో బాగున్నార‌న్నారు. ఇటీవ‌ల నెల్లూరులో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు నాయుడు. నెల్లూరు సిటీ, శ్రీ‌సిటీని, తిరుప‌తిని ఓ ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్ డెవ‌ల‌ప్ చేసి…ఇక్క‌డుండే వారంద‌రికి మంచి ఉద్యోగాలు క‌ల్పించి…వారి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తాన‌ని హామీ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని గుర్తు చేశారు.

అదే విధంగా నెల్లూరుని హార్డ్ వేర్ హ‌బ్ లాగా చేస్తామ‌న్నారు. అలాగే నెల్లూరులో యువ‌తీ యువ‌కుల కోసం మ‌ళ్లీ స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్ల‌ను రీ ఓపెన్ చేస్తామ‌ని చెప్పార‌న్నారు. గ‌త ఐదేళ్లుగా వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఫించ‌నుదారులు అనేక అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌న్నారు. ఏవేవో కుంటుసాకులు చెప్పి ఫించ‌న్ల‌ను ఎత్తేశార‌న్నారు. దీని కార‌ణంగా…ఎంతో మంది నిరుపేద ల‌బ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌త రెండు నెల‌లుగా ఫించ‌న్లు స‌క్ర‌మంగా ఇవ్వ‌క‌పోవ‌డంతో…వృద్ధులు, విక‌లాంగులు బ్యాంకుల చుట్టూ…ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతూ న‌ర‌కం అనుభ‌విస్తున్నార‌న్నారు. కొంత మందికి డ‌బ్బులు రాక‌పోవ‌డంతో ప్రాణాలు కూడా పోగొట్టుకున్న ప‌రిస్థితిని వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింద‌ని మండిప‌డ్డారు. ప్ర‌ధానంగా టీడీపీ అధికారంలోకి రాగానే వృద్ధుల‌కు 4వేలు పెన్ష‌న్‌, విక‌లాంగుల‌కు 6వేల పెన్ష‌న్ ను…ఏప్రిల్ నుంచే అమ‌లులోకి తీసుకువ‌స్తామ‌ని చంద్ర‌బాబు వాగ్ధానం చేశార‌న్నారు. నేరుగా ల‌బ్ధిదారుల ఇంటికే ఫించ‌ను వ‌చ్చేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించార‌న్నారు. అలాగే పూర్తి అంగ‌వైక‌ల్య‌మైతే వారికి నెల‌కి రూ. 15వేలు ఇస్తామ‌ని చెప్పార‌న్నారు. బీసీ, మైనార్టీ, ఎస్టీ, ఎస్టీల వ‌ర్గాల వారంద‌రిని 50 ఏళ్ల‌కే ఫించ‌నుకు అర్హుల‌య్యేలా చూస్తామ‌న్నారు. భారత దేశంలోనే…హైద‌రాబాద్ ని ఒక మ‌హాన‌గ‌రంగా తీర్చిదిద్దిన ఘ‌న‌త చంద్ర‌బాబుదేన‌న్నారు. అదే విధంగా… నెల్లూరుని కూడా భార‌త దేశంలోనే నెం.1 మోడ‌ల్ సిటీగా మార్చేందుకు నారాయ‌ణ‌, వేమిరెడ్డిలు ఉన్నార‌న్నారు. మే 13న ప్ర‌జ‌లంద‌రూ సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేయాల‌ని కోరారు. ఎమ్మెల్యేగా నారాయ‌ణ‌ను, ఎంపీగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిల‌ను అఖండ మెజారిటీతో గెలిపించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Read Previous

రాష్ట్రంలో దోపిడీ తప్పా అభివృద్ధి లేదు : ప్రచారంలో విపిఆర్, ఆనం ధ్వజం

Read Next

కోవూరు నియోజకవర్గంలో విజయసాయిరెడ్డి కుమార్తె విస్త్రృత ప్రచారం

Leave a Reply

Your email address will not be published.