వరికుంటపాడులో వైసీపికి భారీ షాక్ : కాకర్ల సమక్షంలో టిడిపిలో చేరిన గిరిజన కుటుంబాలు

Clock Of Nellore ( Vinjamuru ) – ఉదయగిరి నియోజకవర్గం, వరికుంటపాడు మండలంలోని మహందాపురంలోని గిరిజన కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. గొల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన గిరిజన కటుంబాలన్నీ టిడిపి నేతలు ఆవుల మధుసూదన్ రావు, చండ్ర వెంకయ్య ఆధ్వర్యంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్నాయి. ఉదయగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కాకర్ల సురేష్ వారందికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రజలంతా ఏకధాటిపై ఉన్నారని, ఈనెల 13న జరిగే ఎన్నికల్లో అందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని ప్రజలు గ్రహించారని, అది స్పష్టంగా తెలుస్తోందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో టిడిపి విజయం ఖాయమని స్పష్టం చేశారు.

మజ్జిగ చలివేంద్రం ప్రారంభం…
జలదంకిలోని నాగిరెడ్డి పాళెంకు చెందిన యువ నాయకులు పిచ్చపాటి పవన్ కళ్యాణ్, జిర్ర మాల్యాద్రి తమ సొంత నిధులతో జలదంకిలోని 9వ మైలు వద్ద హైవే పక్కనే ప్రయాణీకుల కోసం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని కాకర్ల సురేష్ బుధవారం ప్రారంభించారు. వేసవిలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని వారిని అభినందించారు. ప్రజాసేవ చేసేందుకు ఎవరు ముందుకొచ్చినా వారికి తన సంపూర్ణ సహాయ సహకారాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు కాకర్ల సురేష్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సేవా కార్యక్రమాలను మరింత విస్త్రృతం చేస్తానని హామీ ఇచ్చారు.

Read Previous

అందుబాటులో లేని వ్యక్తులను తిరస్కరించండి : ప్రజలకు కోటంరెడ్డి పిలుపు

Read Next

మంచి కోరే అభ్యర్ధులను ఎన్నుకోండి : ప్రచారంలో విజయసాయి, ఆదాల వెల్లడి

Leave a Reply

Your email address will not be published.