బాలయ్యను కలిసిన విపిఆర్, నారాయణ, బీద

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో ఎన్నికల ప్రచారం కోసం వచ్చి గత రాత్రి నెల్లూరులోని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇంట్లో బస చేసిన హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటులు నందమూరి భాలకృష్ణతో శనివారం ఉదయం పలువురు భేటీ అయ్యారు. నెల్లూరు పార్లమెంటు టిడిపి అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ అభ్యర్ధి పొంగూరు నారాయణ, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రలు బాలయ్యను కలిశారు. వేమిరెడ్డి, నారాయణ కాసేపు బాలయ్యతో ముచ్చటించారు. జిల్లా రాజకీయాలపై చర్చించారు. అనంతరం బాలయ్య ప్రచారం కోసం వెంకటగిరికి బయలుదేరి వెళ్లారు.

Read Previous

కోటంరెడ్డి… నేనూ… సేమ్ టు సేమ్ … కోటంరెడ్డికి బాలయ్య కితాబు…

Read Next

ప్రజల అండే నా బలం : దొంతాలి ప్రచారంలో ఆదాల వెల్లడి

Leave a Reply

Your email address will not be published.