Clock Of Nellore ( Nellore ) – వైసీపీ ప్రభుత్వమే మరో ఐదేళ్లు కొనసాగితే…యువత భవిష్యత్ మొత్తం అంధకారంలోకి వెళ్లిపోతుందని మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో…ఆయన స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి…నెల్లూరు 4వ డివిజన్ సత్య నారాయణ పురం, శ్రీనివాస నగర్ ..3వీధి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా నారాయణకి డివిజన్లోని ప్రజలు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లో ప్రచార రథంపై పర్యటిస్తూ…మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి…నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.
అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఏ డివిజన్‌కెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు. దీని కారణం ఏమిటంటే… 2014 నుంచి 2019 వరకు ఈ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. అదే విధంగా మైపాడు గేటు వద్ద మంచి ఘాట్ నిర్మించామని…అది కట్టమని ఎవరూ అడగలేదని…దేవుడి కార్యక్రమం తెప్పోత్సవాన్ని ప్రతీ ఏడాది ఎంతో వైభవంగా నిర్వహిస్తారన్న ఉద్దేశంతో టీడీపీ హయాంలోనే ఘాట్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే దోమలు లేని నగరంగా తీర్చిదిద్దాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, దుమ్ము లేని సిటీగా చేయాలని ఎండ్ టూ ఎండ్ రోడ్లు అద్భుతంగా వేశామని…ఇవన్నీ నన్ను అడగలేదని…కానీ ప్రజల కోసం చేశామని.. అందుకనే ఆ అభివృద్ధి పనులన్నింటిని ప్రజలు బాగా గుర్తు పెట్టుకున్నారన్నారు. ప్రధానంగా 2014 నుంచి 2019 వరకు ఏం జరిగింది…2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందో ప్రజలే బేరీజు వేసుకుంటున్నారన్నారు. ఆ అభివృద్ధిని వాళ్లే నిర్ణయిస్తారని…ఎక్కడకెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోతే…యువత భవిష్యత్ శూన్యమన్నారు. ఏ ప్రభుత్వమైనా…పిల్లల భవిష్యత్‌ను దృష్టి పెట్టుకొని…అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన తప్ప మరేమి లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వమే మరో ఐదేళ్లు కొనసాగితే…పిల్లల భవిష్యత్ పూర్తిగా అంధకారంలోకి వెళ్లిపోతుందన్నారు. నెల్లూరు గడ్డ మీద పుట్టి పెరిగాను కాబట్టే… నెల్లూరుకి ఏదో ఒకటి చేయాలన్న మంచి ఉద్దేశంతో… ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశానని గుర్తు చేశారు.
నేను మంత్రిగా పని చేసిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో మాట్లాడి రూ. 5, 260 కోట్లు పెద్ద మొత్తం నిధులు తీసుకువచ్చి… నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, నెక్లెస్ రోడ్డు, నిరుపేదలకి టిడ్కో గృహాలు, ముస్లింల కోసం బారా షహీద్ దర్గా, షాదీ మంజిల్, మహిళల కోసం ప్రత్యేకంగా కాలేజీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి కార్యక్రమాలను చేశారన్నారు. నిరు పేదలందరిని డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలాదేనని చెప్పారు. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం వల్ల కొంత సపోర్ట్ ఉంటుందని…కానీ అది పర్మినెట్ సొల్యూషన్ కాదన్నారు. పేదలు, నిరుపేదలు డెవలప్ కావాలంటే… వారందరికి చక్కగా ఎడ్యుకేషన్ వచ్చేలా చూడాలన్నారు. అలాగే వారి స్కిల్ డెవలప్ చేయించాలన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఆదరణ పథకం కింద…చిన్న చిన్న పనులు చేసుకునే వారికి పరికరాలు అందించి వారి ఆర్ధకాభివృద్ధికి అండగా నిలిచామని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే…ఖచ్చితంగా నిరుపేదల స్కిల్ డెవలప్ మెంట్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తున్న కాబట్టి నెల్లూరు నగర నియోజకవర్గంలోని రెండు లక్షల 37 వేల మంది ప్రజల బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. రానున్న ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా…వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారని…మా ఇద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే నేను రాష్ట్రం నుంచి…వేమిరెడ్డి కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చి నెల్లూరుని నెం.1 సిటీగా చేస్తామని హామీ ఇచ్చారు.
