వైసీపికి గుడ్ బై చెప్పిన మెట్టుకూరు : లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక

Clock Of Nellore ( Nellore ) – ఉదయగిరి నియోజకవర్గ వైసీపి సీనియర్ నేత, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మైన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంగళవారం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మైన్ పదివితో పాటూ వైసీపి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వెంటనే ఆయన మంగళగిరికి చేరుకుని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మెట్టుకూరు చిరంజీవి రెడ్డికి లోకేష్ పసుపు కండువా వేసి టిడిపిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ నిజాయితీగా పనిచేసే వ్యక్తులకు వైసీపిలో స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీతి, నిబద్దతతో పనిచేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయంలో వైసీపి తీరుపై తాను కూడా మనస్థాపం చెందానని ఆవేదన వ్యక్తం చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అండగా ఉండేందుకే వైసీపికి రాజీనామా చేసి టిడిపిలో చేరానన్నారు. అలాగే ఉదయగిరి నియోజవర్గ టిడిపి అభ్యర్ధి కాకార్ల సురేష్ పనితీరు జనరంజకంగా ఉందని, అతనితో కలిసి పనిచేస్తానని ధనుంజయరెడ్డి స్పష్టం చేశారు.

Read Previous

ఎంపిగా దీవించండి… భూగర్భ విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తా… హామీ ఇచ్చిన విజయసాయి రెడ్డి

Read Next

మండుటెండలో తండ్రి కోసం : 12వ డివిజన్ లో ఆదాల హిమబింధు విస్త్రృత ప్రచారం

Leave a Reply

Your email address will not be published.