Clock Of Nellore ( Nellore ) – రాష్ట్రాంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు సిటి నియోజకవర్గం, 9 వ డివిజన్ లో సోమవారం పార్టీ స్థానిక అసెంబ్లీ అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్ తదితరులతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైఎస్ఆర్ సిపి అభ్యర్ధులకు అడుగడుగునా ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. ఈ ఐదేళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో వారికి వివరిస్తూ… వచ్చే ఐదేళ్లు కాలంలో ఏ విధంగా అభివృద్ధి, సంక్షేమం అందిస్తామో ప్రజలకు వివరిస్తూ ఈ ప్రచారం సాగింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మీ ఆశీర్వాదం కోసం నేను, సిటి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఖలీల్ అహ్మద్ మీ ముందుకు వచ్చామని, వచ్చే ఎన్నికల్లో మాకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. నెల్లూరు అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను వచ్చే ఐదేళ్ల కాలంలో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. తోమ్మిదవ వార్డు కార్పోరేటర్ రాజశేఖర్ వైఎస్ఆర్ సిపి నుండి గెలిచి టిడిపికి వెళ్లిపోయి, మన పార్టీకి వెన్నుపోటు పోడిచాడని మండిపడ్డారు. మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన ఈ వార్డులోని కార్యకర్తలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. వెన్నుపోటు రాజకీయాలను ప్రోత్సాహించే చంద్రబాబు జీవితం అంతా వెన్నుపోటు రాజకీయలతో నిండిపోయిందన్నారు.
నేను నెల్లూరు జిల్లాలో పుట్టి, పెరిగి, ఇక్కడ చదువుకుని ఇప్పుడు మీకు సేవ చేయాలని ఎంపిగా పోటి చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల కన్నా నెల్లూరు మెరుగైన జిల్లాగా మారుస్తానాని ఆయన హామీ ఇచ్చారు. నాకు, ఖలీల్ కు ఒక్క అవకాశం ఇవ్వండి. నెల్లూరును అభివృద్ధిలో ముందుకు తీసుకేళ్తామని భరోసానిచ్చారు. విద్యుత్ వైర్ల సమస్య పరిష్కరించి, భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. నెల్లూరు వ్యాప్తంగా డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరుస్తానన్నారు. టిడిపి అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,పొంగురు నారాయణ లాగా నాకు వ్యాపారాలు లేవని, నాకు ప్రజా సేవా చేయడం, 24 గంటలు రాజకీయాలలో ఉండటం మాత్రమే తెలుసన్నారు. నేను, అసెంబ్లీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఇద్దరం ప్రజా సేవలోనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ, ‘వైఎస్సార్సీపీ రహిత ఏపీ’ చేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. నిజానికి ఆంధ్రా ఓటర్లు టీడీపీ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఎంతో పట్టుదలతో ఉన్నారనే విషయం చంద్రబాబు తెలుసుకుంటే చాలా మంచిదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఏం చేయలేకపోయిందని, ప్రజల గుండేళ్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏవరూ ఏంచెయలేరన్నారు.
