Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. దీంతో…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ల షాక్‌లు తగులుతున్నాయి. నెల్లూరు నగరం గోమతి నగర్ లోని నారాయణ క్యాంప్ కార్యాలయంలో… మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సమక్షంలో… గూడూరు శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో 8వ డివిజన్‌కి చెందిన షేక్ షఫీ మిత్ర బృందంతోపాటు…పలువురు వైసీపీ వాలంటీర్లు… టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వారందరికి నారాయణ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి అభినందించారు. చంద్రబాబు పాలన మెచ్చి తమ పార్టీలో చేరుతుండడం నిజంగా సంతోషంగా ఉందని నారాయణ తెలిపారు. టీడీపీలో చేరే ప్రతీ ఒక్కరికి సముచిత స్థానంతోపాటు గౌరవం ఉంటుందని భరోసా ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీ ఎన్టీఏ కూటమి విజయానికి ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.
