Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు భారీగా మద్దుతు తెలియజేస్తున్నారు. అనేక మంది వైసీపి నేతులు, మద్దతు దారులు శుక్రవారం టిడిపి అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా సంయుక్త కార్యదర్శి పెరుమాళ్ల పద్మజా యాదవ్ కోటంరెడ్డి సమక్షంలో టిడిపి కండువా కప్పుకున్నారు. పిలిస్తే పలికే నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఆయనతోనే తన రాజకీయ ప్రస్తానం అంటూ ఆమె టిడిపిలో చేరారు. ఆమెతో పాటూ ఉడతా శైలజా యాదవ్, అనుపమ, అనురాధ, హరిత, భార్గవి తదితరులు కూడా టిడిపిలో చేరారు. మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపి రూరల్ అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి డబ్బు ఉంది అనే అహంతో ఎంతో మంది క్యాడర్ ను దూరం చేసుకుంటూ, కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని పద్మజా యాదవ్ ఈ సందర్భంగా ఆరోపించారు. పిలిస్తే పలికే నేత ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డేనని స్పష్టం చేశారు. త్వరలో జరిగే ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యేగా మరో సారి శ్రీధర్ రెడ్డిని గెలిపించుకుంటామని ఆమె వెల్లడించారు. వైసీపి అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లోకల్ అని 24 గంటలూ అందుబాటులోనే ఉంటారన్నారు. రూరల్ నియోజకవర్గ ప్రజలు శ్రీధర్ రెడ్డిని దీవించాలని విజ్ఞప్తి చేశారు.
మరో వైపు 24వ డివిజన్ కు చెందిన మాజీ సర్పంచ్ ఉడతా మల్లిఖార్జున యాదవ్, ఉడతా ప్రవీణ్ కుమార్ యాదవ్ లు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. వందలాది మంది అనుచరులతో కలిసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. కొండ్లపూడి సంఘానికి చెందిన దొండకాయల సుధాకర్ కూడా టిడిపిలో చేరారు. నరసింహస్వామి దేవస్ధానం మాజీ ఛైర్మైన్ వేమిరెడ్డి సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో శ్రీధర్ రెడ్డి సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. 24వ డివిజన్ ఇందిరమ్మ కాలనీకి చెందిన పి. సుబ్బయ్య, పి. వాసు కూడా టిడిపిలో చేరారు. వందలాది మంది అనుచరులతో కలిసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయానికి రాగా శ్రీధర్ రెడ్డి వారందరికీ పసుపు కండువాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. అలాగే ఆమంచర్ల అరుంధతీవాడకు చెందిన బిరదవోలు పవన్ కళ్యాణ్ తన అనుచరులతో కలిసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. 26వ డివిజన్ కు చెందిన సాబ్ జాన్ మేస్త్రి, 28వ డివిజన్ కు చెందిన పల్లిపాటి ప్రసాద్ లు కూడా టిడిపిలో చేరారు. త్వరలో జరిగే ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.
