Clock Of Nellore ( Nellore ) – అధికార వైసీపి ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడం ఖాయమని నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రూరల్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైసీపి నేతలు, కార్యకర్తలు సోమవారం కోటంరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ కోటంరెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో కష్టపడి టిడిపి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చేది టిడిపి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో అధికార వైసీపి ప్రలోభాలకు గురిచేస్తుందని, ప్రజలు అప్రమత్తంగా లేకుంటే ఐదేళ్లు నరకాన్ని అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కావలంటే చంద్రబాబు రావాలని కోటంరెడ్డి పిలుపునిచ్చారు.
