Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర ప్రజలంతా నారాయణ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని నాారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా ఏ గడపకు వెళ్లినా మా ఓటు నారాయణకే అంటున్నారని ఆమె వెల్లడించారు. నెల్లూరు 40వ డివిజన్ లో ఆమె శనివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇరుకళలమ్మ దేవస్థానం, వాకర్స్ రోడ్డు తదితర ప్రాంతాల్లో జనసేన నేతలతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి త్వరలో జరిగే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుండి టిడిపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నారాయణను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని, ఈ సారి నాారాయణకే ఓటు వేస్తామని ప్రజలు స్వచ్ఛంధంగా తనకు తెలియజేస్తున్నారని చెప్పారు. నారాయణ వస్తేనే నగరం బాగుపడుతుందని, సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు బలంగా నమ్ముతుండటం సంతోషకరమన్నారు. నగర నియోజకవర్గంలో అనేక మందికి పెన్షన్లు తొలగించారని కొందరు తన దృష్ఠికి తీసుకొచ్చారని, టిడిపి ప్రభుత్వం రాగానే ఆ పెన్షన్లను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా నగరంలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని రమాదేవి వెల్లడించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో నారాయణను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
