Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంభందించి తెలుగుదేశం పార్టీలోకి వివిధ పార్టీల నుండి చేరికలు సునామీలా సాగుతున్నాయి. పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలే కాకుండా తటస్థులు కూడా తెలుగుదేశం పార్టీకి తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో ప్రతీ రోజూ వందలాది మంది తరలివచ్చి టిడిపి తీర్ధం పుచ్చుకుంటున్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ముచ్చటగా మూడో సారి గెలిపించుకుంటామని వారు వెల్లడిస్తున్నారు. తాజాగా సోమవారం నాడు 20వ డివిజన్ కు చెందిన వైసీపి కీలక నేతలు ఆరుగంట దామోదర్ రెడ్డి, వాకాటి ప్రసాద్ రెడ్డి, చల్లగుంట్ల రాంబాబు, ఆలూరు సంపత్ రెడ్డి, పసల సుబ్బయ్య, గుడ్డపాతల రవి, చెరుకూరు వినోద్ తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయాారు. సజ్జాపురం గ్రామానికి చెందిన ఎరగల పెంచలయ్య కూడా తన అనుచరులతో కలిసి కోటంరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే 22వ డివిజన్ సప్తగిరి కాలనీకి చెందిన కలపాటి జయంతి రెడ్డి, కట్టా సులోచన, సముద్రాల ప్రశాంతిలు వారి అనుచరులతో కలసి టిడిపిలో చేరారు. వారందరికీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పసుపు కండువాలు వేసి టిడిపిలోకి ఆహ్వానించారు. చేరికల సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఐదేళ్ల వైసీపి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగితే రాష్ట్రానికి భవిష్యత్తు కూడా ఉండదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాకుండా, భవిష్యత్తుకు కూడా భరోసాగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
