మోకాలి మార్పిడి శస్త్ర చికత్సల్లో నూతన శకం : అపోలో హాస్పిటల్ లో అందుబాటులో సిరామిక్ ఇంప్లాంట్స్

  • మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల్లో నూతన శకం
  • నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అందుబాటులో కొచ్చిన సిరామిక్ ఇంప్లాంట్స్
  • సిరామిక్ ఇంప్లాంట్ల్ వంద శాతం సురక్షితం, ఇన్ ఫెక్షన్లకు దూరం
  • సద్వినియోగం చేసుకోవాలన్న డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల్లో నూతన శకానికి నాంది పలికింది నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్. శస్త్ర చికిత్సల్లో 100 శాతం సురక్షితమైన సిరామిక్ ఇంప్లాంట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ వివిధ రకాల్లో చేసే మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల్లో మోకీలు వద్ద అమర్చే ఇంప్లాంట్స్… గోల్డ్, సిల్వర్ తో తయారు చేసేవి వాడేవారు. అయితే అవి కొద్ది సంవత్సరాల తర్వాత ఇన్ ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిపై దృష్ఠి సారించిన అపోలో హాస్పిటల్స్ సంస్థ పూర్తి స్థాయి వంద శాతం సురక్షితమైన ఇంప్లాంట్స్ ను తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేసి విజయవంతమైంది. గోల్డ్, సిల్వర్ ఇంప్లాంట్స్ స్థానంలో సిరామిక్ ఇంప్లాంట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సిరామిక్ ఇంప్లాంట్స్ వంద శాతం సురక్షితమైంది. ఎన్ని సంవత్సరాలు గడచినా సిరామిక్ ఇంప్లాంట్స్ ఇన్ ఫెక్షన్లకు గురికాదు. అంతే కాకుండా సాధారణ ఇంప్లాంట్స్ కంటే సిరామిక్ ఇంప్లాంట్స్ జీవిత కాలం చాలా ఎక్కువ. శస్త్ర చికిత్స చేయించుకున్న వారి జీవిత కాలం పొడిగింపులో కూడా చాలా ఉపయోగకరం. సిరామిక్ ఇంప్లాంట్స్ ఎన్ని సంవత్సరాలు గడిచినా తడిగానే ఉంటూ రోగి యొక్క జీవన ప్రమాణాన్ని మెరుగుపరుస్తుంది. ఈ సిరామిక్ ఇంప్లాంట్స్ నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నేటి నుండి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం అపోలో హాస్పిటల్ లో జరిగిన మీడియా సమావేశంలో సీనియర్ కన్సల్ టెంట్, జాయింట్ రీప్లేస్ మెంట్ అండ్ ఆర్ధోస్కోపి సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, ఆర్దోపెడిక్ సర్జన్ డాక్టర్ పమ్మి కార్తీక్ రెడ్డి మాట్లాడారు. మోకాలి శస్త్ర చికిత్సల్లో సిరామిక్ ఇంప్లాంట్స్ పెను విప్లవమని పేర్కొన్నారు. మొట్ట మొదటి సారిగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో సిరామిక్ ఇంప్లాంట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. వందశాతం సురక్షితమైన సిరామిక్ ఇంప్లాంట్స్ ను మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు చేసుకుని రోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ పత్రికా విలేఖరుల సమావేశంలో వీరితో పాటూ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ఆదిత్య, డాక్టర్ షాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

ఎప్పటికైనా తిరుపతే రాష్ట్ర రాజధాని అవుతుంది : చింతా మోహన్ వెల్లడి

Read Next

టిడిపిలో చేరికల సునామీ : రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి జోరు

Leave a Reply

Your email address will not be published.