Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పలువురు కలిసి తమ మద్దతును తెలియజేస్తున్నారు. నిన్న రాజీనామా ప్రకటన చేసిన వెంటనే టిడిపి నేతలు, అనేక మంది వైసీపి నేతలు ఆయన్ను కలిసి సంఘీభావం తెలిపారు. తాజాగా గురువారం కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గ టిడిపి ముఖ్య నాయకులతో కలిసి నెల్లూరుకు విచ్చేసిన నాగేశ్వరరావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వారి నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై ఇరువురూ చర్చించారు. మరో వైపు కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త గుడి హరిరెడ్డి కూడా కార్యకర్తలతో కలిసి వేమిరెడ్డిని కలిసి తమ మద్దతును తెలియజేశారు. పుష్పగుచ్చం అందజేసి సంఘీభావం ప్రకటించారు.
